అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయిల్ లెబనాన్ ప్రధానులతో మాట్లాడాను . ఇక పై యుధ్ధపరిణామాలు ఉండవంటూ ప్రకటించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇజ్రాయిల్ - హిజ్బుల్లా మధ్య కాల్పులకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. హిజ్బుల్లా తో ఇజ్రాయిల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విషయాన్ని ట్రంప్ గెలిచినపుడే అందరు ఊహించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయిల్ లెబనాన్ ప్రధానులతో మాట్లాడాను . ఇక పై యుధ్ధపరిణామాలు ఉండవంటూ ప్రకటించారు.
అమెరికా దౌత్యంతో లెబనాన్‌లో యుద్ధానికి ముగించడానికి మార్గం సుగమమయింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి. లెబనాన్ లో సుమారు 3800 మంది మరణించగా దాదాపు 16వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి వెళ్లిపోవల్సి ఉండా లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాలి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. మరో వైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహు కూడా స్పందించారు. చిన్నారులు , ఆడవారు , ప్రజలు తమ దేశ యుధ్దపరిణాలకు భయపడిపోయారని ...తమకు శాంతి కావాలని కోరారు లెబనాన్ ప్రధాని.