అన్నీ ..టాక్సిక్ ప్రేమలే. నిజంగా మిమ్మల్ని టార్గెట్ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటే.. అది మీకు మంచిది కాదు వదిలేయండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ కాలం లో ప్రేమ..అబధ్దం అని చెప్పలేం కాని ..నిజమైన ప్రేమ అంత సులువగా దొరకదు అని మాత్రం చెప్పగలను. కాని వందలో ఎక్కడో ఒక దగ్గర మాత్రమే అసలు ప్రేమ ...మిగిలివి అన్నీ ..టాక్సిక్ ప్రేమలే. నిజంగా మిమ్మల్ని టార్గెట్ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటే.. అది మీకు మంచిది కాదు వదిలేయండి.
* మీ భాగస్వామి ఎక్కువ పొసేసివ్ అయితే ...కొన్ని సార్లు ...కొంత వరకు అందంగా ఉంటాయి. కాని మితిమీరకూడదు. మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకుండా...తనతో మాత్రమే కట్టిపడేసే రిలేషన్ షిప్ మీకు అవసరం లేదు. మనల్ని బలహీనులుగా మార్చుతారు. చిన్న సమస్యలా కనిపించినా మీరు వారికి బానిసలుగా బ్రతుకుతారు. మీకే తెలియకుండా మీ ఇండివ్యుయలిటీ మిస్ అవుతారు.
*అబధ్దాలు చెబుతూ ..నిలకడగా లేని రిలేషన్ షిప్ లో మీరు లైట్ తీసుకోవడమే మంచిది . మీరు అనుకున్నట్లు వారు మారరు. అలా నిలకడగా లేని వారు తమను మీరు ఎక్కడ తక్కువగా చూస్తారో అనే భయంతో చిన్న చిన్న విషయానికే చిరాకు పడడం, అరవడం, కోప్పడడం.. లాంటివి చేస్తారు.
* ఆరోగ్యకరమైన బంధంలో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడాలు అనేవి ఉంటాయి. కానీ మిమ్మల్ని వేధించాలని చూసే భాగస్వామి ఏ విషయంలోనూ రాజీ పడరని నిపుణులు అంటున్నారు. మీ మనసు బాధపడినా వారికి అవసరం ఉండదు..వాళ్లకు వాళ్ల పని అయిపోవాలి.
* అస్తమాను అనుమానించే ప్రేమికుడు /ప్రేమికురాలు మీకు అవసరం లేదు. అనుమానం పెనుభూతం ...ఆ ్యాధి పెద్దది అవుతుందే కాని తగ్గదు. దీని వల్ల మీరు మీ చిన్న చిన్న ఆనందాలను కూడా కోల్పోతారు.
* చివరగా ...మీ అనుమానించే భర్తతో ఆడది ఎంత బాధపడుతుందో ...అస్తమాను అలిగే ఆడపిల్లలతో మగవారు కూడా అంతే ఇబ్బంది పడతారు. సో అస్తమాను అలిగే అమ్మాయిని ఎక్కువ బ్రతిమాలుకోవాలి. మీ జీవితం అంతా మరొకరిని బ్రతిమాలుకోవడంలోనే గడపకండి. దాంతో మీకు ఆనందం ఉండదు.