హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ల్వాల్, చిలకలగూడ, బేగంపేట, ఎల్బీ.నగర్, సరూర్ నగర్, కొత్తపేట, నాగోల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుండి వర్షం మొదలైంది. అల్పపీడనం వల్ల భారీ వర్షాలు రానున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం కురుస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, మహబూబాబాద్, గార్లలో వర్షం కురుస్తోంది. పాకాలవాగు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో ఈరోజు తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ల్వాల్, చిలకలగూడ, బేగంపేట, ఎల్బీ.నగర్, సరూర్ నగర్, కొత్తపేట, నాగోల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
హైదరాబాద్‌కు ఐఎండీ భారీ వర్షసూచన ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అంతేకాకుండా భద్రాద్రికొత్తగూడెం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.