దేశీయ మార్కెట్లలో దీని ప్రభావం పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఈ రోజు బంగారం ధర 500 తగ్గింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి ముందు బంగారం ధరలు చూసి భయమేసింది. రేటు మరీ దారుణంగా ఉంటుంది. రేటు 89 వేల రేటు దొరికింది. దేశీయ మార్కెట్లలో దీని ప్రభావం పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఈ రోజు బంగారం ధర 500 తగ్గింది. దేశీయ మార్కెట్లలోనూ దీని ప్రభావం పడిందని అంటున్నారు. గడిచిన రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 500 మేరకు తగ్గింది. అమెరికాలో ఎన్నికలు వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడానికి కారణం కావచ్చని బిజినెస్ నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 460 మేరకు తగ్గి.. రూ. 73,140 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500 మేరకు తగ్గి.. రూ. 79,790 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,06,900 అలానే కోల్ కత్తా , ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ 97,900 బెంగుళూరులో కిలో వెండిధర రూ.96,900 కు చేరింది.
దాదాపు అన్ని తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ధర నడుస్తుంది. వెండి మాత్రం బెంగుళూరు, కలకత్తా లో కూడా వెండి ధర తక్కువగా ఉంది. మరింత తగ్గే అవకాశముందంటున్నారు.