శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ కోసం కేరి గ్రామ సమీపంలోని ఓ కొండపైకి వెళ్లింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గోవా వెళ్లారంటే ...ఎంజాయ్ చెయ్యాలనే వెళ్తారు. కాని అనుకోకుండా ఆ ట్రిప్ లో మహారాష్ట్రకు చెందిన మహిళ ఒకరు మరణించారు. ఆ మహిళతో పాటు పారాగ్లైడింగ్ చేసే ఇణ స్ట్రక్టర్ కూడా చనిపోయాడు. నార్త్ గోవాలోని కేరి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పూణేకు చెందిన శివానీ దాబ్లే గోవా పర్యటనకు వచ్చింది. శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ కోసం కేరి గ్రామ సమీపంలోని ఓ కొండపైకి వెళ్లింది.
ఆమెతో పాటు పారాగ్లైడింగ్ కంపెనీకి చెందిన ఇన్ స్ట్రక్టర్ సుమల్ నేపాలీ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పైకి వెళ్లిన కాసేపటికే లోయలో పడిపోయారు. దీంతో తీవ్ర గాయాలైన శవాని , సుమల్ ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. పారాగ్లైడింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వివరించారు. కంపెనీ నిర్వాహకులపై కేసు తప్పనిసరి అని అన్నారు గోవా పోలీసులు.