ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. రెండు నెలల పాటు జరిగిన విచారణ లో ఈ రోజు కీలక తీర్పు రానుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కలకత్తా నిర్భయ కేసులో కీలక తీర్పు ఈ రోజు రానుంది. నిందితుడు సంజయ్ రాయ్ కు మరణ శిక్ష విధించాలని సీబీఐ సిఫార్సు చేసింది. మరికొందరి ప్రమేయం ఉందని అనుమానాలున్నా...వాటిపై కోర్టు కాని విచారణ కాని ఏం జరగలేదు. అయితే సీల్దా కోర్టు ఈ రోజు కీలక తీర్పును ఇవ్వనుంది. జడ్జ్‌మెంట్‌కు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో ఉత్కంఠగా మారింది.. గతేడాది ఆగస్ట్9న ఆర్జీకర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై హత్యాచారం ఘటన జరిగింది. నవంబర్ 12నుంచి సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. రెండు నెలల పాటు జరిగిన విచారణ లో ఈ రోజు కీలక తీర్పు రానుంది.
ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ సర్కార్‌ను కోలకతా హైకోర్టు తీవ్రంగా మందలించింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. హత్యాచారం కేసులో నిందితులను ఉరితీయాలన్నారు. కొందరు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ కలకత్తా కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు.
సంచలనం రేపిన డాక్టర్ హత్యాచారం కేసులో నివేదిక ఇచ్చిన సీబీఐ.. నిందితుడికి మరణ శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. అయితే సీబీఐ చెప్పినట్లు ఉరి శిక్షా లేక ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనేది చూడాలి. హత్యాచారం లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని డాక్టర్ అభయ పేరెంట్స్.. ..నిజం తేల్చి..వాళ్లందరికి శిక్ష వేయాలంటున్నారు. ఈ సిల్దా కోర్టు తీర్పు కోసం యావత్తు భారత్ ఎదురుచూస్తుంది.