kolkata: 'హత్యాచారం చేసింది అతడే'- కోలకత్తా నిర్భయ కేసులో కోర్టు నిర్ణయం!

భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద దోషి సంజయ్‌రాయ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 


Published Jan 18, 2025 04:56:00 PM
postImages/2025-01-18/1737199750_dDETXHShywtdwMyR6TrQ.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కోలకత్తా నిర్భయ కేసులో కోర్టు దోషి ఎవరో తెలిపింది. ఆర్​జీ కర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది. భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద దోషి సంజయ్‌రాయ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 


అయితే విచారణ లో భాగంగా సంజయ్ రాయ్ కోర్టులో మాట్లాడుతూ ...తను ఈ నురం చెయ్యలేదని ..ఈ కేసులో తనను ఇరికించారని అన్నాడు. ఇందులో ఒక ఐపీఎస్ పాత్ర ఉందని తెలిపాడు. సోమవారం శిక్ష ఖరారు సందర్భంగా దోషి సంజయ్‌రాయ్‌ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని సీల్దా కోర్టు అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు కోసం కోర్టు బయట భారీ ఎత్తున ప్రజలు గుమికూడారు. 


అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ...


2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగింది. సెమినార్ రూమ్ లో ఒంటరిగా ఉన్న జూనియర్ డాక్టర్ పై నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. హాస్పటిల్ ఆవరణలో సీసీటీవీలో నమోదైన దానిని బట్టి చూస్తే సివిక్ వాలంటీరైన సంజయ్ రాయ్ ను ఆగస్టు 10 న కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు సంజయ్‌కు లై డిటెక్టర్ టెస్​ను నిర్వహించింది.


ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగపత్రంలో ప్రస్తావించలేదు.సంజయ్ రాయ్ డీఎన్ ఏ మృతురాలి శరీరంపై లభ్యమయ్యిందని తెలిపారు. ఘటనాస్థలంలో లభ్యమైన వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ నిందితుడివేనని తెలిపింది. మృతురాలి రక్త నమూనాలు సంజయ్ రాయ్ దుస్తులు, చెప్పులపై దొరికాయి. దీనిని ఆధారంగా చేసుకొని సీబీఐ మరణ శిక్ష విధించాలని కోరింది.


కాని ఇంకా మృతురాలి తల్లితండ్రులు తమ బిడ్డకు న్యాయం జరగలేదని...ఇంకా తప్పు చేసిన వారు బయటే తిరుగుతున్నారని అన్నారు. దర్యాప్తు సగమే జరిగిందని తెలిపారు. చాలా ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. తీర్పు దగ్గరపడే సరికి ..సంజయ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా, తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్‌ చేయకపోవడం వల్ల ఈ బెయిల్ లభించింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mamathabenarjee nirbhayaofkolkata

Related Articles