mahesh surya:సూర్య, మహేష్ బాబులు  చిన్ననాటి స్నేహితులని మీకు తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే ఎంతటి ఆదరణ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ విధంగానే కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా  హీరో సూర్య అంటే  తెలియని వారు ఉండరు.


Published Jul 28, 2024 09:18:12 AM
postImages/2024-07-28/1722172442_maheshbabu.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే ఎంతటి ఆదరణ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ విధంగానే కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా  హీరో సూర్య అంటే  తెలియని వారు ఉండరు. అలా ఈ ఇద్దరు హీరోలు రెండు ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు.  అంతే కాదు ఈ ఇద్దరు హీరోలు కూడా ఓకే దగ్గర చదువుకున్నారట. అంతేకాకుండా మరో వ్యక్తి కూడా వీరితో చదువుకున్నారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కోలీవుడ్ స్టార్ హీరో  సూర్య మరియు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ముగ్గురు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారని  తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు ఇదే విషయాన్ని సూర్య ఒక సందర్భంలో బయట చెప్పేశారు. వీరు ముగ్గురు కలిసి చెన్నై సెయింట్ బీడ్స్ స్కూల్ వైపు వెళ్తే  చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయట.

ముగ్గురు కలిసి ఒకటో తరగతి నుంచి మొదలు టెన్త్ వరకు అక్కడే చదువుకున్నారని. అప్పటి రోజులు అంటే మాకు ఎంతో ఇష్టమని ముగ్గురం కలిసి ఒకే దగ్గరే తినేవాళ్ళమని, ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాలను ఒకరికి ఒకరం షేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమని చెప్పారు.  మేము టెన్త్ వరకు వచ్చేదాకా ఏనాడు  హీరోలం అవుతామని అనుకోలేదు.  అలా అనుకోకుండా మహేష్ బాబు టాలీవుడ్ లో హీరో అయ్యారు నేను కోలీవుడ్ లో హీరో అయ్యానని చెప్పుకొచ్చారు.

 మహేష్ బాబు తన నాన్నతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చేశారు. అంతే కాదు మహేష్ బాబు చిన్నతనం అంతా చెన్నైలోనే గడిచిందని  అన్నారు. మహేష్ బాబుకు చిన్ననాటి స్నేహితులు తప్ప పెద్ద అయిన తర్వాత పెద్దగా స్నేహాలు చేయలేదని, ఆయన ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులతో టచ్ లో ఉంటారని ఒక సందర్భంలో రివిల్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు ఎక్కువగా టచ్ లో ఉండే హీరోలలో సూర్యా కూడా ఒకరు. ఈ విధంగా మహేష్ బాబు చెన్నైలో చదువు పూర్తయ్యాక విదేశాలకు వెళ్లి చదువుకొని తర్వాత ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mahesh-babu yuvan-shankar-raja surya- chennai-school

Related Articles