కథ అంతా 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్ ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మహానటి , సీతారామం లాంటి బ్లాక్ బాస్టర్స్ కొట్టాడు దుల్కర్ ను తెలుగు ఆడియన్స్ చాలా ఆదరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కు ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే తాజాగా లక్కీ భాస్కర్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ కు హిట్టు పడిందో లేదో చూసేద్దాం రండి.
కథలోకి వెళ్తే ..
కథ అంతా 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్ ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. ఇంటికి పెద్ద కొడుకు . ఇంటిమీద అప్పుల వాళ్లు వస్తే తప్పించుకుంటాడ. ఇలా భాస్కర్ లైఫ్ తప్పించుకొని తిరుగుతుంటాడు.ఆయన భార్య సుమతి ,కొడుకు బ్యాంకు జీతం సరిపోక లైఫ్ నడిపిస్తు ఉంటాడు. చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేస్తాడు.అలాంటి భాస్కర్ జీవితంలోకి ఒకసారి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే ఆంటోనీ వస్తాడు. తన జాబ్‌ను రిస్క్ చేసి ఆంటోనీతో కలిసి బిజినెస్ మొదలు పెడతాడు భాస్కర్. క్లిక్ అయ్యి కోట్లు సంపాదిస్తారు. కాని బ్యాంకు డబ్బుతో ఇల్లీగల్ పనులు చేస్తూ క్లవర్ గా తప్పించుకుంటాడు. అంతా బాగుందనుకున్న టైంలో అసలు సాధారణ బ్యాంక్ క్లర్క్ అకౌంట్ లో వందల కోట్లు ఎలా వచ్చాయనేది సీబీఐ కి డౌట్ వస్తుంది.
వెంకీ అట్లూరి డైరెక్షన్ కంటే కూడా రైటింగ్‌కు ఫిదా అయ్యారు. కొన్ని సీన్స్ అధ్భుతంగా తీశారు వెంకి అట్లూరి స్టోరీ రైటింగ్ చాలా బాగుంది. ఒక్కో సీన్ పై చాలా వర్కవుట్ చేశారు. అయితే ఓ మిడిల్ క్లాస్ మెన్ బ్యాకింగ్ లో జరిగే స్కామ్స్ ను వాడుకొని ఎలా అసామాన్యుడుగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. అదేదో మనకే డబ్బు వస్తున్నట్లు కథలో లీనమైపోతాం. హీరో కంగారు పడితే మనం కంగారు పడతాం.. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం.. హీరో దొరికిపోతాడని భయపడిపోతాం. హీరో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా చాలా బాగుంది. దుల్కర్ చేసిన అన్ని సినిమాల్లోను ఇదే బెస్ట్ అని చెప్పగలిగేంత బాగా యాక్ట్ చేశాడు. వెంకీ అట్లూరి ఈ సినిమా తో మరింత మంచి అవకాశాలు అందుకుంటాడు. ఇది మాత్ం పక్కా. మ్యూజిక్ అయితే జివి ప్రకాశ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు.