Telangana DSC: డీఎస్సీ పరీక్ష కీ విడుదల

తెలంగాణ డీఎస్సీ ప‌రీక్ష‌ల ప్రాథ‌మిక కీ విడుద‌లైంది.


Published Aug 13, 2024 06:07:42 PM
postImages/2024-08-13/1723552662_tsdsc.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ డీఎస్సీ ప‌రీక్ష‌ల ప్రాథ‌మిక కీ విడుద‌లైంది. మంగళవారం తెంగాణ గురుకుల బోర్డు కీ ను విడుదల చేసింది. స్కూల్ ఎడ్యుకేష‌న్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్య‌ర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంత‌రాలు తెల‌పాల‌ని అధికారులు సూచించారు. డీఎస్సీ ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది జులై 18 నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించిన విషయం తెలిసిందే. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాశారు.

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://tgdsc.aptonline.in/tgdsc/InitialKey

newsline-whatsapp-channel
Tags : telangana students release dsc

Related Articles