viral: ప్రభాస్ కొత్త హీరోయిన్..యూట్యూబర్ అని తెలుసా..వైరల్ అవుతున్న పాత వీడియో ?

కల్కి ఏడీ 2898 లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్టు . రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ డబుల్ అయ్యింది. ప్రభాస్ ఇప్పుడు మరో సినిమా టెంకాయ కొట్టారు


Published Aug 19, 2024 02:19:04 AM
postImages/2024-08-19/1724036044_prabhasandimanesmail.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కల్కి ఏడీ 2898 లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్టు . రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ డబుల్ అయ్యింది. ప్రభాస్ ఇప్పుడు మరో సినిమా టెంకాయ కొట్టారు. నిన్న ఈ పూజ జరిపించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమాకు ‘ఫౌజి’ టైటిల్‌ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అఫిషియల్ అనౌన్స్ మెంట్ కాదు. ఆ సినిమా కొత్త హీరోయిన్ ఇమాన్ ఇస్మాయిల్ పేరుతో తన పాత డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేశారు. 


 సాయి పల్లవి, శ్రీలీల, నయా సెన్సేషన్‌ భాగ్య శ్రీ సూపర్‌గా డ్యాన్స్‌ చేస్తారు.. ఇప్పుడు వీరికి ఈ ఇమాన్‌ ఇస్మాయిల్‌ కూడా తోడవనుంది. ఢిల్లీకి చెందిన ఇమాన్‌ ఇస్మాయిల్‌.. 1995 అక్టోబర్‌ 20న జన్మించింది. చూడడానికి చక్కని తెలుగు పిల్లలా ఉందంటున్నారు నెటిజన్లు. డ్యాన్స్ మాత్రం అధ్భుతంగా చేస్తుంది. 


చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై ఇష్టంతో చదువుకుంటూనే డ్యాన్స్‌ నేర్చుకుంది. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత.. యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి.. తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్స్ ప్ల్యూయెన్సర్ గా మారింది. చాలా స్టేజ్ లపై కూడా డ్యాన్సర్ గా తన సత్తా చాటింది.ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మడు ప్రభాస్ పక్కన కనిపించేసరికి జనాలు మరింత అట్రాక్ట్ అయిపోతున్నారు.ప్రభాస్‌తో ఫొటో తర్వాత.. ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 686K ఫాలోవర్స్ ఉన్నారు. మరి కింద ఉన్న ఇమాన్‌ ఇస్మాయిల్‌ డ్యాన్స్‌ అన్ని రాష్ట్రాల వారిని ఇంప్రెస్ చేసిందంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu pakisthan-heroine youtuber

Related Articles