శివాజీ రాజా అసలు నక్సలైట్ అవుదామనుకున్నారట. కాని అవ్వలేక ఇలా యాక్టర్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చాలామంది కలలు కంటాం. కాని కనే కలలు వేరే...మనం చేస్తున్న పనులు వేరు. ఏం చేస్తాం బతకడానికి బోలెడు పనులు. యాక్టర్ గా ఎన్నో సినిమాలతో మెప్పించారు శివాజీ రాజా. శివాజీ రాజా సరదా కాన్వర్జేషన్స్ లో చెప్పారు. శివాజీ రాజా అసలు నక్సలైట్ అవుదామనుకున్నారట. కాని అవ్వలేక ఇలా యాక్టర్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు.
నాకు గన్స్ అంటే పిచ్చి. నేను యంగ్ గా ఉన్నప్పుడు నక్సలైట్ అయితే నేను గన్ పట్టుకుంటాను బాగుంటుంది అనిపించేది. అప్పట్లో నా పై గద్దర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎంత కష్టపడైనా నక్సలైట్ అయిపోదామనుకునేవాడిని..అంటూ నవ్వారు. నిజానికి కృష్ణవంశీ సింధూరం సినిమాలో రవితేజ క్యారక్టర్ నేను చెయ్యా్లసింది. కాని మిస్ అయ్యింది, యంగ్ ఏజ్ లో ఏదో తెలియని పిచ్చి ఉంటుంది. ఏదైనా అయిపోవచ్చు. అట్రాక్షన్ ..అదిసరైన విధంగా వాడుకుంటే లైఫ్ ను బాగా సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో లైసెన్సుడ్ గన్ ఉంది. గతంలో ఒకటి రెండు సార్లు ఫామ్ హౌస్ లో ఖాళీగా ఊరికే పేల్చాను. ఇప్పుడు అలా పేల్చట్లేదు. అలా చేయకూడదు అని తెలిసింది అని చెప్పారు.