హీరో సిద్ధార్థ్ అదితి రావు హైదరి వివాహం దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య దేవాలయంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు వివాహం తర్వాత వీరికి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్
న్యూస్ లైన్ డెస్క్: హీరో సిద్ధార్థ్ అదితి రావు హైదరి వివాహం దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య దేవాలయంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు వివాహం తర్వాత వీరికి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త వైరల్ గా మారాయి. అయితే వీరికి పెళ్లి జరిగిన అప్పటినుంచి వీరి గురించి, వీరి లవ్ స్టోరీ గురించి అనేక విషయాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిద్ధార్థ్ అదితి మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య ఎనిమిది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందట. అయితే ఈ ఏజ్ అనేది వారి మధ్య డిఫరెన్స్ ఏమీ చూపించలేదని అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.
ఇక 2001లో మహాసముద్రం అనే సినిమా ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు. షూటింగ్ అయిపోయే వరకు ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమ అలా కొనసాగిస్తూ తాజాగా వివాహం ద్వారా ఒకటయ్యారు. అలాంటి ఈ జంటకు త్వరగా పండంటి బిడ్డ పుట్టాలని వారి అభిమానులు కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.