mohini avatharam: మోహినీ అవతారంలో శ్రీనివాసుడు !

ఐదో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు


Published Oct 08, 2024 07:43:00 PM
postImages/2024-10-08/1728396841_mohiniavataram.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే స్వామివారు శ్రీకృష్ణ అలంకారితుడై అభయమిచ్చాడు. గజరాజులు భక్త జన బృందాలు స్వామి వారి రూపం చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. స్వామివారి పల్లకీ సేవ కోలాహలంగా జరిగింది. 


మోహినీ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని శ్రీవారు తెలియజేస్తున్నారు. నారాయణుడి భక్తులు కాని వారు మాత్రం స్వామి వారి మాయ కు లోనవ్వకుండా ఉండరనే చెప్పడమే ఈ అవతారం ముఖ్య ఉద్దేశ్యం.


తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపు రోజుకు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వేల సంఖ్యలో భక్తులు స్వామి సేవా కార్యాక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు ఎన్నో వేల మందికి అన్న సమారాధానలు, లక్షల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్వ సదుపాయాలు కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi krishna ttd tirumala

Related Articles