Nagarjuna:N కన్వెన్షన్ భూమి ఎకరాకు ఎంతో తెలిస్తే షాకే.? 

గత 24 గంటల నుంచి నాగార్జునకు సంబంధించినటువంటి అక్రమ భూమి గురించే వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే నాగార్జున మాదాపూర్ సమీపంలో హైటెక్ సిటీకి దగ్గర తుమ్మిడి చెరువు ఆక్రమణ చేసి


Published Aug 25, 2024 10:29:44 AM
postImages/2024-08-25/1724561984_nagarjuna.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత 24 గంటల నుంచి నాగార్జునకు సంబంధించినటువంటి అక్రమ భూమి గురించే వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే నాగార్జున మాదాపూర్ సమీపంలో హైటెక్ సిటీకి దగ్గర తుమ్మిడి చెరువు ఆక్రమణ చేసి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నిర్మించారని  ఆరోపణలు వచ్చాయి.  అయితే గత పది సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతూ వస్తోంది. అయితే 2014లో మొదలైన ఈ వివాదానికి రేవంత్ రెడ్డి సర్కార్ ముగింపు పలకడంతో మరింత హాట్ టాపిక్ అయింది.

అలాంటి ఎన్ కన్వెన్షన్ హాల్  కూల్చివేత గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ కన్వెన్షన్ హాలు ద్వారా నాగార్జున ఒక్కో ఫంక్షన్ కు 50 లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదిస్తారని అన్నారు. అంతేకాకుండా ఈ ఎన్ కన్వెన్షన్ హాల్లో ఎకరా భూమి ధర 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం నాగార్జున  ఆక్రమించిన భూమి ద్వారా దాదాపు 400 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

దీనిపై స్పందించిన నాగార్జున నా పట్టా భూమి అని, ఇది కోర్టులో నడుస్తోందని, కోర్టు నా భూమి కాదని తెలిస్తే నేను దాన్ని వదిలిపెడతానని ట్విట్ చేశాడు. మరి చూడాలి చివరికి ఇది ప్రభుత్వ భూమి అవుతుందా, లేదంటే నాగార్జున నా భూమి అని ఏమైనా పట్టా చూపిస్తాడా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా రేవంత్ ప్రభుత్వంలో హైడ్రా  అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu hyderabad nagarjuna n-convension-hall hydra

Related Articles