పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ల మధ్య ట్వీట్ల పరంపర కొనసాగుతోంది.వీరిద్దరూ ఒకరిపై ఒకరు ట్వీట్ల రూపంలో కౌంటర్స్ వేసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తిరుమల
న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ల మధ్య ట్వీట్ల పరంపర కొనసాగుతోంది.వీరిద్దరూ ఒకరిపై ఒకరు ట్వీట్ల రూపంలో కౌంటర్స్ వేసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదం గురించి హిందూ ధర్మం సనాతన ధర్మం అని మాట్లాడి హిందువులందరూ ఏకమై బయటికి రోడ్లమీదకి రండి అంటూ మాట్లాడడం ప్రకాష్ రాజ్ కి అస్సలు నచ్చలేదు.
దాంతో ఎందుకు ఇప్పుడు ఉన్న మత కల్లోలాలు చాలవని మళ్ళీ కొత్త మత చిచ్చులు పెడుతున్నావు.. అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మొదట ట్వీట్ పెట్టాడు.అయితే ఈ ట్వీట్ పై పవన్ ఫైర్ అయ్యి సనాతన ధర్మం హిందూ ధర్మం అంటూ మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు వాడి ప్రకాష్ రాజ్ ని నిందించారు. ఇక పవన్ మాటలకు ప్రకాష్ రాజ్ మళ్ళీ కౌంటర్ ఇస్తూ నేను పెట్టిన ట్వీట్ సరిగ్గా చూడలేదేమో..
ఒకసారి మళ్ళీ వెళ్లి చూడు దాన్ని అర్థం చేసుకో అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు కార్తీ చేసిన పనికి పవన్ మండిపడ్డారు.దానికి కార్తి,సూర్య సారీ చెప్పడంతో పవన్ పేరు తీయకుండా అసలు ఇలా అడిగిమరీ క్షమాపణలు చెప్పించుకోవడం ఎందుకో జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ తాజా ట్వీట్ లో గెలవక ముందు ఒక అవతారం..
గెలిచాక మరో అవతారం ఏందయ్యా మాకు ఈ అవాంతరం.. మనకు ఎందుకు ఈ అయోమయం..ఏది నిజం జస్ట్ అడుగుతున్నా ఆస్కింగ్ అంటూ పెట్టాడు. అలా పరోక్షంగా పగటివేషగాడు అంటూ ప్రకాష్ రాజ్ పవన్ పై సెటైర్ వేశారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.ఏందయ్యా సామి నీ గోల..ఏం పని లేదా అంటూ మండిపడుతున్నారు.
https://x.com/prakashraaj/status/1839200681015546033