రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే లావణ్య వివాదానికి భయపడి రాజ్ తరుణ్ బయటికి రావడమే మానేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే లావణ్య వివాదానికి భయపడి రాజ్ తరుణ్ బయటికి రావడమే మానేశారు. ఎందుకంటే రీసెంట్గా ఆయన నటించిన పురుషోత్తముడు సినిమా విడుదలైన సమయంలో ఎలాంటి ప్రమోషన్స్లో పాల్గొనలేదు.
అలాగే ఆ సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్లో పాల్గొనక పోవడంతో చాలామంది లావణ్య వివాదం గురించి అడుగుతారనే భయంతో ఆయన బయటికి రాలేదని భావించారు. అయితే తాజాగా మాల్వి మల్హోత్రాతో కలిసి నటించిన తిరగబడరా సామి మూవీ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజ్ తరుణ్ మాల్వితో కలిసి పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్లో మీడియా వాళ్ళు మీరు లావణ్యతో వివాదం జరిగాక బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు అని అడగగా..
నేను మనిషినే.నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. నాకు బాధ ఉండదా.. ఈ వివాదం జరిగాక నేను ఎంత ఎఫెక్ట్ అయ్యానో నాకే తెలుసు. నా మంచితనంతో నేను వెళ్తున్నాను. నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకూడదు.నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను.నాపై ఏ ఒక్కరినైనా సరే చెడ్డవాడినని చెప్పమనండి..నేను ఆ వివాదం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను.
కానీ ఇంట్లోనే కూర్చుని ఉంటే మా ఫ్యామిలీ మరింత ఇబ్బందులకు గురవుతుంది. అందుకే నేను ధైర్యం తెచ్చుకొని ఇంటి నుండి బయటకి వచ్చాను. నేను చాలా సెన్సిటివ్.. ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.అన్ని లీగల్ గానే చూసుకుంటాను అంటూ రాజ్ తరుణ్ మీడియాతో చెప్పుకొచ్చారు