ప్రభాస్ తో సినిమా అనగానే ఎగిరిగంతేలుసిన రకుల్ కు నాలుగు రోజుల షూటింగ్ తర్వాత తీసేశారట. ఇంతకీ ఏ సినిమాకి ఏంటి కథ అంటారా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీ లో ఎవ్వరి కోసం ఎవ్వరు ఆలోచించరు. అందరు సినిమా కోసమే ఆలోచిస్తారు. సినిమా కోసం అస్సలు మొహంమాటం లేకుండా ఎంత పెద్ద స్టార్ ని అయినా తప్పించేస్తారు. అలా సైడ్ చేసేసిన వారిలో రకుల్ కూడా ఉన్నారు. ప్రభాస్ తో సినిమా అనగానే ఎగిరిగంతేలుసిన రకుల్ కు నాలుగు రోజుల షూటింగ్ తర్వాత తీసేశారట. ఇంతకీ ఏ సినిమాకి ఏంటి కథ అంటారా.
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు ఫస్ట్ రకులే హీరోయిన్ . సూపర్ జోష్ తో సినిమా స్టార్ట్ చేశాం. పాపం పెద్ద హీరోతో సినిమా అనేసరికి రకుల్ చాలా పొంగిపోయింది. కాని నాలుగు రోజుల షూటింగ్ తర్వాత చూస్తే ప్రభాస్ పక్కన రకుల్ అంతగా బాలేదు. సన్నగా ఏం మాత్రం సెట్ కాలేదు. అందులోను మిస్టర్ ఫర్ఫెక్ట్ అంతా హీరోయిన్ పాత్రే ఎక్కువ . రకుల్ ఉంటే సినిమా పోతుంది అనిపించి షూటింగ్ ఆపేశారు.
రకుల్ షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో తన మరో సినిమా షూటింగ్ నిమిత్తమై ఢిల్లీ కి వెళ్లివచ్చేసరికి తనని ఈ చిత్రం నుంచి తప్పించినట్లు తెలిసిందని చెప్పుకొచ్చింది. కనీసం దిల్ రాజు గారు చెప్పను కూడా చెప్పలేదు. దీనికి రకుల్ చాలా ఫీలయ్యి ఏడ్చిందని కూడా అంటారు.
రకుల్ మాట్లాడుతూ....‘‘ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చిందని చాలా సంతోషించాను.. కానీ, నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే మరొకరిని తన స్థానంలో తీసుకున్నారు . నిజానికి సినిమా కి అది చాలా కరెక్ట్ కాని నాకు చాలా బాధాకరమైన విషయం .