చాలా మంది కంగారుపడి వేల మెసేజ్ లు పెట్టారట. దీని పై రతన్ టాటా రెస్పాండ్ అయ్యారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యం బాలేదనే వార్త సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ వైరల్ అయిపోతుంది. చాలా మంది కంగారుపడి వేల మెసేజ్ లు పెట్టారట. దీని పై రతన్ టాటా రెస్పాండ్ అయ్యారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యాపార రంగంలో రతన్ టాటా పై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. దీని పై రతన్ టాటా మాట్లాడతూ...తనకేం కాలేదని ...సోషల్ మీడియా వార్తలు నిజం కాదని తెలిపారు.
నా ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న పుకార్లు నా దృష్టికి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. నా వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ప్రస్తుతం కొన్ని వైద్యపరమైన పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అందరి లాగా ఏజ్ కారణంగానే వచ్చే చిన్న చిన్న సమస్యలే కాని పెద్దగా ఏం లేదని తెలిపారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజానీకాన్ని, మీడియాను కోరుతున్నాను" అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. కాని సోషల్ మీడియా వార్తల కారణంగా చాలా మంది తన ఆరోగ్యం కోసం ఆందోళన చెందారని వారికి చాలా ధన్యవాదాలని ..తనకేం కాలేదని టెన్షన్ పడొద్దని తెలిపారు.