డిసెంబర్ 2024 లో శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా పదవిని చేపట్టిన తర్వాత ఇదే మొదటి ప్రకటన. ఈ విషయాన్ని ఆర్బీఐ తన అధికారిక వెబ్ సైట్ లో అనౌన్స్ చేసిం
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆర్బీఐ కొత్త డెసిషన్ తీసుకుంది. కొత్త రూ. 50 కరెన్సీ నోటును విడుదల చేయనుంది. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. డిసెంబర్ 2024 లో శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా పదవిని చేపట్టిన తర్వాత ఇదే మొదటి ప్రకటన. ఈ విషయాన్ని ఆర్బీఐ తన అధికారిక వెబ్ సైట్ లో అనౌన్స్ చేసింది.
గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన పాత రూ. 50 నోట్ల రూపకల్పనకు అనుగుణంగా ఈ నోట్లలో మహాత్మా గాంధీ చిత్రపటం కొనసాగుతుంది. పాత 50 రూపాయిల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి. అయితే 56 ఏళ్ల సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం 2022లో ఆర్‌బీఐ గవర్నర్ పదవికి నామినేట్ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన మూడేళ్ల పదవీకాలానికి నియామకం దేశ ద్రవ్య విధానంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నారు.
అంతేకాదు మరోవైపు.. ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకుకు కూడా భారీ ఊరట కలిగింది. 2024 ఏప్రిల్ నెలలో ఈ కోటక్ మహీంద్రా బ్యాంకుపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నట్టుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది.ఇక పై ఆన్ లైన్ , మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మహీంద్రా బ్యాంకు కస్టమర్స్ ను తీసుకునే అవకాశం కల్పిస్తుంది. కొత్త క్రెడిట్ కార్డులను కూడా జారీ చేసేందుకు ఆర్బీఐ ఈ కోటక్ మహీంద్రా బ్యాంకుకు అనుమతిని ఇచ్చింది.