Bird Flu: ఏపీ లో కలకలం.. మనుషుల్లోను బర్డ్ ఫ్లూ !

ఏపీ లో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కు సంబంధించి ఫస్ట్ కేసు నమోదైందని అధికారులు చెప్పారు.


Published Feb 13, 2025 12:32:00 PM
postImages/2025-02-13/1739430236_1500x900188980311rdc6.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉంగుటూరు మండలం పరిధిలో కోళ్ల ఫారం సమీపంలో ఉంటున్న వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తెలిపింది. జిల్లా అధికారులు ఫుల్ అలర్ట్ అయ్యారు. స్పెషల్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఏపీ లో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కు సంబంధించి ఫస్ట్ కేసు నమోదైందని అధికారులు చెప్పారు.


కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షల పైచిలుకు కోళ్లు ఈ వైరస్ తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియా లో ప్రచారం కారణంగా చికెన్ కొనుగోళ్లు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu chicken east-godavari birds

Related Articles