ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటుతున్నాయి .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం అందుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా దాదాపు 47 స్థానాల్లో బీజేపీ తన అధిక్యం చూపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటుతున్నాయి .
ఈ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ..ఫుల్ డ్యాన్సులు వేస్తూ కార్యాలయానికి చేరుకున్నారు. వేలాది బీజేపీ కార్యకర్తలు నేతలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీ వెంట కేంద్రమంత్రులు , బీజేపీ అగ్రనేతలు అమిత్ షా , జేపీ నడ్డా కూడా వచ్చారు. ప్రధాని మోదీని సంబరాలు చేసుకుంటూ ఊరిగేంచి తీసుకెళ్లారు.
ఇక, ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులను మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలు మోదీ నినాదాలతో హోరెత్తించారు.