leapod: పెళ్లికి వచ్చిన పెద్దపులి.. అతిధులంతా పరుగే పరుగు !


చిరుత పులిని చూసి అక్కడ అందరూ హడలిపోయారు. పెళ్లికి వచ్చిన గెస్టులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పారిపోయారు.


Published Feb 13, 2025 07:13:00 PM
postImages/2025-02-13/1739454350_LeopardInWedding1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. విషయం ఏంటంటే .. పెళ్లి వేడుకకు ఓ పెద్ద పులి వచ్చింది. లక్నోలో ఓ ఇంట్లో పెళి వేడుక జరిగింది. పెళ్లంటే మాటలా ...ఇళ్లంతా జనాలే. కాని ఇంత జనాల్లో ఎవరూ ఊహించని గెస్ట్ పెళ్లి వేడుకకు వచ్చింది. అడవిలో బోర్ కొట్టిందో ఏమో ..పెద్ద పులి పెళ్లికి వచ్చింది.


చిరుత పులిని చూసి అక్కడ అందరూ హడలిపోయారు. పెళ్లికి వచ్చిన గెస్టులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పారిపోయారు.  అప్పటి వరకు సరదాగా సంగీత్ అని డ్యాన్సులు , గంతులు వేసిన వధువరులు ఇద్దరు జంప్ . అరుపులు, కేకలు వేస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అప్పటివరకు అక్కడ ఆనందం, సంతోషం వెల్లివిరిసింది. సడెన్ గా చిరుత ఎంట్రీ ఇవ్వడంతో కాళరాత్రిలా మారింది.


రాత్రి 11 గంటల ప్రాంతంలో చిరుత సడెన్ ఎంట్రీ ఇచ్చింది. చిరుతను చూసి జనాలు అరుపులు పెట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి రోడ్ లోకి పరుగులు తీశారు. ఓ వ్యక్తి భయంతో బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేయడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news wedding tiger

Related Articles