ఓ ముగ్గురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో కృష్ణగిరి సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పిల్లలకు పాఠాలు చెప్పే గురువులను కూడా నమ్మే రోజులు కాదు ఇవి. మంచి దారిలో పెట్టాల్సిన టీచర్లే పశువులుగా మారుతున్నారు. తమిళనాడులో ఓ ముగ్గురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో కృష్ణగిరి సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది.
కొన్నాళ్లుగా బాలిక స్కూల్ కి రావడం లేదు. ఈ విషయమై స్కూల్ హెచ్ ఎమ్ , తన ఉన్న విద్యార్ధులు ఆరా తీయగా సమాధానం చెప్పకుండా వచ్చింది.దాంతో ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అడిగారు. తమ కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి తీసుకు వెళుతున్నామని చెప్పింది. దీనికి పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు ప్రకాశ్ (37), ఆరుముగం (45), చిన్నస్వామి (57) కారణమని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
దాంతో వెంటనే ఈ ఘటనపై ఆయన పోలీసులకు సమాచారం అందించి, బాలిక పేరెంట్స్ తో జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు ఈ ముగ్గురు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.