Delhi CM Candidate: ఢిల్లీ కుర్చీ అతనిదేనా ...ఎవరీ పర్వేష్ సింగ్ !

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించారు బీజేపీ న్యూ ఢిల్లీ అభ్యర్ధి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ. ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వ్యక్తిగా పేరు గట్టిగా వినిపిస్తుంది.


Published Feb 08, 2025 10:18:00 PM
postImages/2025-02-08/1739033413_bjpsparveshvermadefeatedaapconvenorandtwotimechiefministerarvindkejriwalatnewdelhia08544084616x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దేశమంతా ఆసక్తిగా చూసిన ఢిల్లీ ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ కి భారీ విజయం లభించింది . 42 సీట్లు సాధించిన బీజేపీ కి ఇప్పుడు సీఎం గా ఎవరిని చెయ్యాలనేది పెద్ద టాస్క్. కాని ఎక్కవ పార్టీలో పర్వేష్ సింగ్ పేరు వినిపిస్తుంది.26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం  బీజేపీ చేతికి వచ్చింది . ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించారు బీజేపీ న్యూ ఢిల్లీ అభ్యర్ధి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ. ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వ్యక్తిగా పేరు గట్టిగా వినిపిస్తుంది.


 ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సింగ్ వర్మ. కేజ్రీవాల్‌పై 4089 ఓట్ల తేడాతో గెలిచిన పర్వేష్ సింగ్ వర్మ ఇప్పుడు సీఎం అభ్యర్ధి రేసులో ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్  అభ్యర్ధి సందీప్ దీక్షిత్ కు కేవలం నాలుగు వేల ఓట్లు పోలయ్యాయి.


అసలు ఇంతకీ ఈ పర్వేష్ సింగ్ ఎవరంటే ఈయన బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కొడుకు . పర్వేష్ సింగ్ వర్మ సొంత బాబాయ్ ఆజాద్ సింధ్ గతంలో ఉత్తర ఢిల్లీ మేయర్‌గా పనిచేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో స్కూల్ విద్యను అభ్యసించిన ఈయన బీఏ పూర్తి చేశాక ఎంబీఏ చేశారు. 2013 లో ఢిల్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం కేజ్రీవాల్ పై పోటీ చేసి గెలిచారు. కాని 2014 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్యే గా రాజీనామా చేశారు. తర్వాత 2019 లో కూడా భారీ మెజారిటీతో  ఎంపీగా గెలిచారు. ఎంపీగా పేదళ్ల అనుభవం ఉంది పర్వేష్ సింగ్ . అర్బన్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల జీతాల పర్యవేక్షించే జాయింట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బేసిక్ గా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావడం ఎంపీ గా పదేళ్ల అనుభవం , కేజ్రీవాల్ పై రెండు సార్లు గెలవడం ..మంచి విద్యార్హత కూడా ఢిల్లీ కుర్చీకి ..పర్వేష్ సింగ్ పేరు మొదటగా ఉండడానికి కారణం.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bjp assembly delhi

Related Articles