అక్రమంగా భారత్ లో ఉంటున్న వారిని వెనక్కి పంపుతుంది. అలాంటి వారిని ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది భారత్ గుర్తించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ దేశం , ఆదేశం అని కాదు . ఏ దేశ పౌరులైన అక్రమంగా ఉన్నారని గుర్తిస్తే చాలు వారిని వారి స్వదేశాలకు పంపేస్తుంది అమెరికా . అక్రమ వలసదారులను వెతికి మరీ ఏదో ఖైధీలను పట్టుకున్నట్లు పట్టుకొని తరిమేస్తుంది. అదే బాటలో ఇండియా కూడా వెళ్తుంది. తన అసలు ఆట మొదలుపెట్టింది. అక్రమంగా భారత్ లో ఉంటున్న వారిని వెనక్కి పంపుతుంది. అలాంటి వారిని ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది భారత్ గుర్తించింది.
ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపింది. వారి వీసా గడువు ముగిసిన ఇంకా ఇండియా లో ఉంటూ ..యూట్యూబ్ , టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉన్న వారిని 16 మందిని అధికారులు గుర్తించారు. వారందరిని వెనక్కి పంపేసింది. వీరిలో బంగ్లాదేశ్ కు చెందిన వారు ఐదుమంది ఉన్నారు.
ఇందులో ఓ కుటుంబం ఉంది. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇక, నైజీరియాకు చెందిన తొమ్మిది మంది ఉన్నారు. గినియా నుంచి ఒకరు, ఉబ్జెకిస్థాన్ నుంచి ఒకరు ఉన్నారు. వారందరిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన అధికారులు.. అక్కడి నుంచి వారిని సొంత దేశాలకు తరలించారు.