తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బావ, బొమ్మరిల్లు
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా,, బావ, బొమ్మరిల్లు, ఈయన కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు. ఈ సినిమాలు బారీ హీట్ అవ్వడంతో సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యారు.
కానీ ఆ తర్వాత కథల విషయంలో కాస్త డల్ అవ్వడంతో చాలావరకు ఫ్లాప్ లొచ్చాయి. దీంతో ఆయన కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తూ ఓ మోస్తారుగా గుర్తింపు పొందాడు. అలాంటి సిద్ధార్థ్ సినిమాల విషయం పక్కన పెడితే తన నిజ జీవితంలో మాత్రం చాలా మందితో ఆయన లవ్ లో ఉన్నారని అంటారు. ఈయన త్రిష, సమంత, శృతిహాసన్, వంటి హీరోయిన్లతో లవ్ లో పడి వారిని కూడా పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు వచ్చాయి.
కానీ ఇవన్నీ నిజం కాదని తెలిసిపోయింది. అలాంటి సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరి కలిసి మహాసముద్రం సినిమా చేసే సమయంలోనే లవ్ లో పడ్డారు. అప్పటినుంచి ఇద్దరు ప్రజల కళ్ళు కప్పి వేకేశన్స్ తిరుగుతూ వచ్చారు. సీక్రెట్ గా చేసే పనులు బయటపడడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగానే వీరి సీక్రెట్ రిలేషన్ షిప్ కూడా బయటపడింది. దీంతో వీరు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
అంతేకాదు వారికి ఇష్టమైనటువంటి వనపర్తి లోని రంగాపురం గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో సిద్ధార్థ్ అదితి రావు హైదరీ మెడలో మూడు ముళ్ళు వేసినట్టు తెలుస్తోంది. దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/p/C_95cVpSt7H/?utm_source=ig_web_copy_link