Tollywood:పంచపాండవుల్లా ఈ ఐదుగురు నటులు..ఫోటో వెనుక కథేంటి.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల తర్వాత అంతటి పేరు పొందిన నటుల్లో  ఈ ఐదుగురు నటులు ఉన్నారు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూదిపోగల సత్తా కలిగిన నటులు. కామెడీ పాత్రలైనా,  రౌడీ


Published Sep 20, 2024 03:23:00 PM
postImages/2024-09-20/1726825419_bharani.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల తర్వాత అంతటి పేరు పొందిన నటుల్లో  ఈ ఐదుగురు నటులు ఉన్నారు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూదిపోగల సత్తా కలిగిన నటులు. కామెడీ పాత్రలైనా,  రౌడీ పాత్రలైనా, ఎమోషనల్ పాత్రలైనా ఇలా ఏదైనా సరే అందులో నటించడం కాదు, జీవించగల సత్తా కలిగిన నటులు వీరు. వీరి డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు కూడా వెయిట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ పంచ పాండవులు ఎవరయ్యా అంటే కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, బాబు మోహన్ అలాగే తనికెళ్ల భరణి, చలపతిరావు, కోట శ్రీనివాసరావు.

ఈ ఐదుగురు నటులు ఇండస్ట్రీలో వందలాది సినిమాల్లో నటించి వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇందులో మొదటగా బ్రహ్మానందం గురించి మనం మాటల్లో చెప్పలేం.  ఆయన ఫేస్ చూస్తేనే నవ్వు వస్తుంది. ఆయన ద్వారా కేవలం సినిమా ఇండస్ట్రీ వారే కాకుండా సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా  ఎంతోమంది బతుకుతున్నారు. ఇక ఈయన తర్వాత అంతటి పేరుగాంచిన కమెడియన్ బాబు మోహన్.  చాలా స్పెషల్ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఏర్పాటు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత తనికెళ్ల భరణి ఈయన నటుడి గానే కాకుండా సంగీత రచయితగా కూడా ఎంతో గుర్తింపు ఉంది..

కోట శ్రీనివాసరావు  తండ్రి, మామ, రౌడీ పాత్రలు, కామెడీ పాత్రలు ఇలా ఏదైనా సరే కోటను మించిన వ్యక్తులు ఎవరూ లేరని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత చలపతిరావు  ఈయన కూడా  ఏ చిత్రంలో అయినా తన పాత్రకు తగ్గట్టుగా నటించడంలో దిట్ట అని చెప్పవచ్చు. ఈ ఐదుగురు సీనియర్ నటులు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతో మంచి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వీరంతా ఓ దగ్గర కలుసుకొని  పార్టీలు చేసుకునే వారట. అలా ఒక సందర్భంలో ఈ ఐదుగురు నటులు కలిసినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : news-line chalapathi bramahanandam babu-mohan kota-srinivas

Related Articles