బిగ్ బాస్ సీజన్ 8 చాలా అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి.. మొదటి వారం బేబక్క, రెండవ వారం శేఖర్ భాష, మూడవ వారం అభయ్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అభయ్ వెళ్లిన తర్వాత మళ్లీ
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 చాలా అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి.. మొదటి వారం బేబక్క, రెండవ వారం శేఖర్ భాష, మూడవ వారం అభయ్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అభయ్ వెళ్లిన తర్వాత మళ్లీ నామినేషన్ల పర్వం కొనసాగింది. మునుపటి లాగే అందరూ ఒకరినొకరు నిందించుకొని కొట్టుకున్నారు. ఈ తరుణంలో నబిల్, ప్రేరణ, మణికంఠ , సోనియా, ఆదిత్య, పృద్వి, ఆరుగురు నామినేట్ అయ్యారు.
మరి ఈ వారం ఈ ఆరుగురిలో ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎవరికి ఎక్కువగా ఆదరణ దక్కుతోంది అనే వివరాల్లోకి వెళితే మాత్రం.. ప్రస్తుతం ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్స్ చూస్తే నబిల్ టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో నాగమణికంఠ ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మణికంఠ మొదటి వారంలోనే తప్పు చేసి రియలైజ్ అయ్యాడు. ఇక రెండో వారం తన తప్పులు తెలుసుకొని, మూడో వారంలో నాగార్జున చేతిలో చివాట్లు తిని మరింత రాటు తేలిపోయాడు. ఆయన రోజురోజుకీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ కాస్త బెటర్ గా పెర్ఫార్మన్స్ ఇస్తూ వస్తున్నాడు.
ఇదే తరుణంలో ఆయన మూడు వారాల నుంచి తప్పనిసరిగా నామినేషన్ లో ఉన్నాడు. కానీ మూడు వారాల నుంచి సేఫ్ అవుతూనే వస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన ఎన్నిసార్లు నామినేషన్లలో ఉన్న ప్రజలు ఆయనను సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ను ఏవిధంగా హౌస్ లో అంతా కలిసి నామినేట్ చేసేవారో, ఇప్పుడు నాగమణికంఠను కూడా ప్రతి వారం నామినేట్ చేస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ భయపడకుండా తను అనుకున్నది సాధించే వరకు ముందుకెళ్లాడు.
అలాగే నాగమణికంఠ కూడా ఎవరికి భయపడకుండా తను అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తన ఆట తీరులో కూడా మార్పులు తెచ్చుకొని ఉంటున్నాడు కాబట్టి ఆయనకు రోజురోజుకు ఆదరణ పెరిగిపోయి ఓటింగ్ లో కూడా స్పీడ్ గా దూసుకెళుతున్నాడని చెప్పవచ్చు. ఈ విధంగా ఆయన చివరి సమయం వరకు కొనసాగితే మాత్రం తప్పక టైటిల్ విన్నర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు.