డిజిటల్ ఇండియాలో భాగంగా కోటి స్మార్ట్ ఫోన్స్ ఉచితంగా ఇస్తుందనే వార్త ఇఫ్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా కోటి స్మార్ట్ ఫోన్స్ ఉచితంగా ఇస్తుందనే వార్త ఇఫ్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తుందని దీని సారంశం..
కేంద్రం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందించనుంది. దేశంలోని 1 కోటి మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఇంట్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉచిత స్మార్ట్‌ఫోన్‌ను పొందుతారు. దీనికి ఆధార్ కార్డు నెంబర్ , బ్యాంక్ ఖాతా నెంబర్ ఉండాల్సి ఉంటుంది. మీకు 18 సంవత్సరాలు ఉంటే మీరు ఈ పథకానికి అర్హులవుతారనే వార్త ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వైరల్ వార్త పూర్తిగా అబద్దమని తెల్చి చెప్పంది. ప్రభుత్వం ఎలాంటి ఫోన్లు ఇవ్వడం లేదని తెలిపింది అంతేకాదు దీనిని ఎవరు నమ్మొద్దని కూడా తెలిపారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం, ‘సర్కారీ సౌచ్నా’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక వీడియో కేంద్ర ప్రభుత్వం 1 కోటి మందికి ఉచిత మొబైల్ ఫోన్‌లను ఇస్తుందని పేర్కొంది. దీనికి ఉచిత స్మార్ట్‌ఫోన్ యోజన అని కూడా పేరు పెట్టారు. కాని ఇది నిజంకాదని తెలిపారు .