pm modi: పార్లమెంట్ లో సినిమా చూడనున్న ప్రధాని మోదీ !

బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించే ఆ సినిమా పేరు " ది సబర్మతి రిపోర్ట్ " గోద్రా రైలు దహనం గుజరాత్ అల్లర్ల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ఈ సినిమా డైరక్టర్ చేశారు.


Published Dec 02, 2024 02:22:00 PM
postImages/2024-12-02/1733129567_cr20241202tn674d67302ad5a.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిత్యం బిజీ బిజీగా ఉండే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం ఓ సినిమా చూడనున్నారు. పార్లమెంట్ ఆవరణలో బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించే ఆ సినిమా పేరు " ది సబర్మతి రిపోర్ట్ " గోద్రా రైలు దహనం గుజరాత్ అల్లర్ల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ఈ సినిమా డైరక్టర్ చేశారు.


ఈ సినిమాపై రీసెంట్ గా  ప్రధాని మోదీ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. నిజం ఏంటో ..అబధ్దం ఏంటో ఏం జరిగిందో ఆలస్యంగానైనా నిజం బయటకు వస్తుంది ఈ విషయాన్ని సబర్మతి రిపోర్ట్ సినిమా మరోమారు నిరూపించిందని మెచ్చుకున్నారు. ఈ రోజు ఈ సినిమాను బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్ుల చేస్తున్నారు ప్రధాని మోదీ ఇతర నేతలతో కలిసి ఈ సినిమాను వీక్షిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.


2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేశాయి. నిజానికి బీజేపీ నే ఈ పని చేసిందని ఆరోపణలు కూడా వేశారు.  గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న రైల్వేస్టేషన్ లో నిలిచి ఉన్న సబర్మతి ఎక్స్ ప్రెస్ కు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అందులోని ప్రయాణికులలో 59 మంది చనిపోయారు. ఈ ఘటన ఆధారంగా ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను రూపొందించారు.  ఈ మూవీలో విక్రాంత్ మాస్సే , రాశీ ఖన్నా, ప్రధాన పాత్రల్లో నటించగా రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా నవంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu parliament movies pm-modi

Related Articles