నా మనవడు వ్యోమ్ ఎక్కడ ఉన్నాడో మాకు సమాచారం లేదు. అసలు అతను బతికే ఉన్నాడా..ఎందుకంటే ఆ కుటుంబం ఏమైనా చెయ్యగలదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బెంగుళూరు AI సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా , అత్తగారు నిషా , బావ అనురాగ్ లను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా అతుల్ తండ్రి పవన్ మోడీ మీడియాతో మాట్లాడుతున్నారు. “ముందుగా బెంగళూరు పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా కుమారుడి చావుకు కారణమైన నేరస్తులను పోలీసులు అరెస్టు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ నా మనవడు వ్యోమ్ ఎక్కడ ఉన్నాడో మాకు సమాచారం లేదు. అసలు అతను బతికే ఉన్నాడా..ఎందుకంటే ఆ కుటుంబం ఏమైనా చెయ్యగలదు.
మాకు కావలసింది వ్యోమ్ కస్టడీలో ఉండడమే. మనవడిని మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాం. తాతకు కొడుకు కంటే మనవడే గొప్ప . అందరూ మాకు మధ్ధతుగా ఉన్నారు సంతోషం . దయచేసి మనవడి కస్టడీ కోర్టు మాకు అప్పగించాలి. నా కొడుకు చనిపోయాడు ..వాడిని నా మనవడిలో చూసుకోవాలి. వాడి భవిష్యత్తు బాగుండాలి.
వ్యోమ్ మా కుమారుని చివరి గుర్తు. కోర్టు అతన్ని మాకు అప్పగించాలి. అతడిని బాగా చూసుకుంటాం. మనవళ్లతో చివరి సారి గడపాలనుకుంటున్నాం. అతుల్ ఇక లేరు, కానీ మనవడు మాతోనే ఉండిపోతే బహుశా మా గుండెల్లో ఉన్న గాయాలు కొంతైనా తగ్గుతాయంటూ చెప్పుకొచ్చాడు .