VIRAL: వైఫ్ వాకింగ్ కు వెళ్తుందని ..విడాకులు ఇచ్చేసిన భర్త !

పోలీసులకు కంప్లైయింట్ చేసింది ఆ భార్య. ఈ విచిత్రమైన సంఘటన  మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..


Published Dec 13, 2024 09:56:00 PM
postImages/2024-12-13/1734107229_tripletalaq1.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎంత అప్పు అయినా తీర్చగలం కాని అనుమానం మాత్రం తీర్చగలం. అయితే ఆరోగ్యం మీద శ్రధ్ధ తో వాకింగ్ కు వెళ్లిన భార్య త్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. అయితే ఆమె రోజూ ఒంటరిగా వెళ్లడం గమనించిన భర్త తన భార్య ప్రవర్తనను తప్పుబట్టాడు. ఇంకా మాటలు జరుగుతూనే ఉన్నాయి..టక్కున త్రిపుల్ తలాక్ చెప్పేశాడు. దీంతో పోలీసులకు కంప్లైయింట్ చేసింది ఆ భార్య. ఈ విచిత్రమైన సంఘటన  మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..


మహారాష్ట్రలోని థానే జిల్లాలో ముంబ్రా ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి గత మంగళవారం తన భార్య (25) తండ్రికి ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ ద్వారా తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు. తన భార్య రోజూ ఒంటరిగా వాకింగ్‌కు వెళుతోందని అందుకే ఇలా విడాకులిస్తున్నట్లు పిల్ల తండ్రికి చెప్పేశాడు.


నిజానికి 2019లోనే ‘ట్రిపుల్ తలాక్’ చట్టంపై నిషేధం విధించారు. అయినా ఇలా చెయ్యడంపై  పోలీసులు ఆ భర్తపై కేసు నమోదు చేశారు.  భార్యపై నేరపూరిత బెదిరింపు, ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351(4) కింద బుధవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce mumbai wife husbond

Related Articles