పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గత రెండు రోజులుగా అల్లు అర్జున్ విషయం తెగ వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ ను పలకరిస్తున్నారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీ ..ఆ తర్వాత తన నివాసానికి చేరుకున్నారు .
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైలులో ఉన్న బన్నీ శనివారం రిలీజ్ అయ్యారు. జైలు నుంచి వచ్చిన బన్నీని పరామర్మించడానికి సినీ ప్రముఖులంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. మరికొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి, బన్నీ మేనత్త సురేఖ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు, “మొత్తం దిష్టి పోయింది బాబాయ్. తిరిగి స్వాగతం. ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరువలేదు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది. సంఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకమైనది. ఇక మీదట ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటూ తెలిపారు మంచు మనోజ్.