రాష్ట్ర ప్రెసిడెంట్ పదవి కోసం ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారనే విషయం నిజమేనా అని ఒకరు మెసేజ్ చేశారట. ఇక అది నిజమే అని ఒకరు నిర్దారించడంతో.. ఏ రకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని మరొకరు ప్రశ్నించారు. అందరికీ అవకాశం ఉందా.. లేదా ఎంపిక చేసిన వారికి మాత్రమే ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉందా అని అడిగారు. దీనికి జవాబుగా.. డబ్బులు ఉంటేనే పదవికి అవకాశం ఇస్తారని యువజన కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌లోనే జరిగిన చర్చలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: డబ్బులకు పదవులను అమ్ముకుంటున్న కాంగ్రెస్ బండారం ఎట్టకేలకు బయటపడింది. యువజన కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌లో చేసిన చాట్ లీక్ అవ్వడంతో ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలోనే గ్రూప్ సభ్యుల చాటింగ్ లీక్ అయింది.
రాష్ట్ర ప్రెసిడెంట్ పదవి కోసం ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారనే విషయం నిజమేనా అని ఒకరు మెసేజ్ చేశారట. ఇక అది నిజమే అని ఒకరు నిర్దారించడంతో.. ఏ రకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని మరొకరు ప్రశ్నించారు. అందరికీ అవకాశం ఉందా.. లేదా ఎంపిక చేసిన వారికి మాత్రమే ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉందా అని అడిగారు. దీనికి జవాబుగా.. డబ్బులు ఉంటేనే పదవికి అవకాశం ఇస్తారని యువజన కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌లోనే జరిగిన చర్చలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఒక్కో పదవికి ఒక్కో రేటు ఉన్నట్లు తెలుస్తోంది. కీలక పోస్టులకు పోటీ చేయాలంటే కూడా రేట్లు ఫిక్స్ చేసి ఉంచినట్లు సమాచారం. స్టేట్ ప్రెసిడెంట్‌గా పోటీలో ఉండాలంటే రూ. 20 లక్షల పైమాటే అని చర్చించుకుంటున్నారు. ఇక ఈ చాట్ కాస్తా లీక్ అవ్వడంతో యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ సురభి ద్వివేది పదవులను అమ్మకలకు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.