నువ్వు తీసుకెళ్లిన ప్రాంతంలో ఆగస్ట్ 15 వరకు అందరికీ సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందేమో వెళ్లి అడుగుదామని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఏమ్మేల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే.. రాజీనామా చేసేందుకు సిద్ధమని హరీష్
డేట్, ఏరియా, టైం నువ్వే చెప్పు రేవంత్ రెడ్డి.. నీ ఏరియాకి పోదామా? నా ఏరియాకి పోదామా? అని ఆయన ప్రశ్నించారు. నువ్వు తీసుకెళ్లిన ప్రాంతంలో ఆగస్ట్ 15 వరకు అందరికీ సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందేమో వెళ్లి అడుగుదామని అన్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టి రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కావాలి, 47 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారని హరీష్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసి, రూ.14 వేల కోట్లు కోత పెట్టారని ఆయన అన్నారు.