కొన్ని జిల్లాల్లో అయితే జనజీవనం స్పందించింది. విపత్తు వేళ వరద బాధితులను ఆదుకోవాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో అయితే జనజీవనం స్పందించింది. విపత్తు వేళ వరద బాధితులను ఆదుకోవాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.
తాజగా, హరీష్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు. వర్షాల వేళ కష్టాల్లో ఉన్న ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఏడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుతం కొంత కాలం పాటు రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు గుర్తుచేశారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలి వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. కరెంట్ సరఫరా ఆగిపోయిన చోట్లలో పునరుద్దరణ పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఆహారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.
ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆయన గుర్తుచేశారు. వరదలకారణంగా జ్వరాలు మరింత ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అయన హెచ్చరించారు. వరదల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సకాలంలో ప్రజలకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.