కేదార్ నాథ్ ఆలయం ప్రారంభ తేదీ,టైం లాంటివి తెలుసుకుందాం. ఈ ఏడాదిలో మే 2న కేదార్‌నాథ్ తలుపులు తెరచుకోనున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు త్వరలో తెరుచుకోనున్నాయి. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 న ప్రాంభం అవుతుంది. కేదార్ నాథ్ ఆలయం ప్రారంభ తేదీ,టైం లాంటివి తెలుసుకుందాం. ఈ ఏడాదిలో మే 2న కేదార్‌నాథ్ తలుపులు తెరచుకోనున్నాయి. కేదార్‌నాథ్‌కు దర్శనానికి వెళ్లే భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ 2025 మే 2న తెరుచుకుంటుంది. ఇందులో బద్రీనాథ్ ఆలయం, గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం కూడా ఉన్నాయి. ఈ యాత్ర ఏప్రిల్ 30 ,2025 న గంగోత్రి , యమునోత్రి ఆలయాలు తెరవడంతో ప్రారంభం అవుతుంది. కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు మే 2, 2025 న ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని ప్రకటించారు. ఫిబ్రవరి 26 న మహాశివరాత్రి పవిత్ర రోజున ఉఖిమత్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో శివుడిని పూజించిన తర్వాత ఈ తేదీని నిర్ణయించారు.
గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం 2025 ఏప్రిల్ 30న అక్షయ తృతీయ శుభ దినాన తెరుచుకుంటాయి. కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకుంటాయి. సాధారణంగా దీపావళి తర్వాత వచ్చే భాయ్ దూజ్ రోజున ఆలయం సాధారణంగా మూసివేస్తారు.
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు మార్చి 2, 2025 నుంచి ప్రారంభమవుతాయి. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం మీరు ( registrationandtouristcare.uk.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కేదార్ నాథ్ యాత్రకు గౌరీకుంఢ్ నుంచి కేదార్ నాథ్ యాత్రకు కాలినడకన భక్తులు వెళ్తుంటారు. సాధారణంగా కేదార్ నాథ్ యాత్రకు కాలినడకన భక్తులు వెళ్తుంటారు. దాదాపు 16 కి.మీ ప్రయాణించాలి.