ghmc: ఇక పై రోడ్డుపై చెత్త వేస్తే ..మిషన్ అరుస్తుందిక్కడ !

అబద్దం చెప్తే మిషన్ అరుస్తుంది చూశారా అలా..ఇక పై చెత్త రోడ్లపై వేస్తే మిషన్ అరుస్తుంది. అదొక్కటే కాదు తెలుగు లో తిడుతుంది కూడా.


Published Mar 04, 2025 01:22:00 PM
postImages/2025-03-04/1741074799_131.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అదేదో సినిమాలో చెప్పినట్లు నాగార్జున హీరోగా  ఆ మధ్య వచ్చిన సూపర్ సినిమాలో బ్రహ్మానందం దగ్గర అబద్దాలు కనిపెట్టే మిషన్ ఉంటుంది. అబద్దం చెప్తే మిషన్ అరుస్తుంది చూశారా అలా..ఇక పై చెత్త రోడ్లపై వేస్తే మిషన్ అరుస్తుంది. అదొక్కటే కాదు తెలుగు లో తిడుతుంది కూడా.


రోడ్లపై చెత్త వేయొద్దని జీహెచ్‌ఎంసీ ఎంతగా చెబుతున్నా చాలా మంది వినిపించుకోరు. బస్సుల్లో నుంచి వెళ్తూ కొందరు కిటిల్లోనుంచే పేపర్లు పడేస్తారు. స్ట్రీట్ ఫుడ్ తింటారు రోడ్లపైనే చెత్త వేస్తారు. బైకుపై వెళ్తూ రోడ్డుపైనే చెత్తను వేసేస్తారు. ఇంట్లోని చెత్తను మోసుకొచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు.కాని అలాంటి వారి పని పట్టే మిషన్ ను తీసుకొచ్చారు.రోడ్డు మీద చెత్త వేస్తే కిస్సిక్‌ మంటూ ఫొటో కూడా తీస్తుంది ఈ మిషన్. ఫొటో వస్తే ఫైన్ కూడా ఉంటుంది కదా . ఇది కాని సక్సస్ అయితే సిటీ అంతా వాయిస్ అసిస్టెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు.


 బంజారా హిల్స్‌లో ఓపెన్ గార్బేజీల వద్ద ఏర్పాటు చేసిన వాయిస్ అసిస్టెన్స్ కెమెరా ఎవరైనా చెత్త వేసేందుకు వస్తే ఫొటో తీస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీనగర్ లో ఓపెన్ గార్బేజీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన వాయిస్ అసిస్టెన్స్ కెమెరా సెన్సార్‌.. ఎవరైనా చెత్త వేస్తే వారిని గుర్తిస్తోంది. అనంతరం వాయిస్‌ కంట్రోల్‌కు అది సందేశం పంపుతుంది. వెంటనే అక్కడ చెత్త వెయ్యకూడదని తెలుగు , హిందీ , ఇంగ్లీష్ బాషల్లో మైకు అరుస్తుంది. ఈ ప్రయోగం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు అంటున్నారు.ఈ ప్రయోగం విజయవంతమైతే జూబ్లీహిల్స్ సర్కిల్ 18లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ghmc

Related Articles