BSNL Holi Offer : బీఎస్ ఎన్ ఎల్ కస్టమర్ల కు హూలీ ఆఫర్...30 రోజుల ఫ్రీ వాలిడిటీ !


బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో 60GB డేటా కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు హోలీ ఆఫర్‌తో బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 425 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.


Published Mar 04, 2025 06:37:00 PM
postImages/2025-03-04/1741093736_BSNLBeastPlan.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ హోలీ పండుగ సందర్భంగా యూజర్లకు బెస్ట్ ఆఫర్ అందిస్తోంది. కంపెనీ ప్లాన్లలో ఒక ప్లాన్ వ్యాలిడిటీని ఒక నెల పొడిగించింది. అంటే కంపెనీ ఈ అందించే ప్లాన్ లో 30 రోజుల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తుంది.


బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో 60GB డేటా కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు హోలీ ఆఫర్‌తో బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 425 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.  మీరు రీఛార్జ్ చేసిన తర్వాత దాదాపు 14 నెలల పాటు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. బీఎస్ ఎన్ ఎల్ ఈ ప్లాన్ ధర రూ. 2399 కు అందిస్తుంది. ఈ ప్లాన్ లో వచ్చే మరిన్ని బెనిఫిట్స్ గురించి డీటైల్స్ తెలుసుకుందాం.


బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్ గతంలో 395 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ బెనిఫిట్స్ అందించింది. కానీ, హోలీ పండుగ సందర్భంగా, బీఎస్ఎన్ఎల్ 30 రోజుల ఫ్రీ వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. అంటే, కస్టమర్లు ఇప్పుడు 425 రోజుల వ్యాలిడిటీ మొత్తం 850GB డేటాను పొందవచ్చు.  అయితే 2399 ప్లాన్ లో లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. రోజుకు 100ప్రీ ఎస్ ఎంఎస్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ బెనిఫిట్స్ 14 నెలల పాటు అందుబాటులో ఉంటాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu call-data bsnl

Related Articles