Revanth Reddy : పోలీసు బందోబస్తు నడుమ రేవంత్ రెడ్డి శవయాత్ర

రూ.2 లక్షల వరకు రుణమున్న రైతులందరికీ ఆగష్టు 15 నాటితో రుణమాఫీ పూర్తిచేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సగం కంటే తక్కువ మందికి రుణమాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారంటూ రైతులు రోడ్డెక్కారు.


Published Aug 18, 2024 03:15:45 AM
postImages/2024-08-18/1723966447_RevanthReddylastrites.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్ సర్కార్ మీద తెలంగాణ రైతాంగం కన్నెర్ర జేసింది. రూ.2 లక్షల వరకు రుణమున్న రైతులందరికీ ఆగష్టు 15 నాటితో రుణమాఫీ పూర్తిచేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సగం కంటే తక్కువ మందికి రుణమాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారంటూ రైతులు రోడ్డెక్కారు. ఓట్ల కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పారంటూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు కాంగ్రెస్ సర్కార్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాట ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శవయాత్రలు చేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో తమకు రుణమాఫీ కాలేదని రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ శవయాత్రకు పోలీసులే బందోబస్తు ఇవ్వడం గమనార్హం.

తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో రైతులు అర్ధనగ్న ప్రదర్శన, రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. రైతులు భారీసంఖ్యలో రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు బందోబస్తుగా వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy newslinetelugu cm-revanth-reddy runamafi latest-news news-updates

Related Articles