గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. నూతనకల్ మండల పరిధిలోని మాచనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతులు తమ కుమర్తెను సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదిస్తున్నారు. అయితే, సరస్వతి(10) అనుమానస్పదంగా మృతిచెందినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారికి జ్వరం వచ్చిందని ఉదయం ఏడు గంటలకు గురుకుల పాఠశాల నుండి ఫోన్ వచ్చిందని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న వరుస ఘటనలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కావడంతో గత 4 నెలల్లో 226 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒక విద్యార్థి మృతిచెందాడు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుండడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. నూతనకల్ మండల పరిధిలోని మాచనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతులు తమ కుమర్తెను సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదిస్తున్నారు. అయితే, సరస్వతి(10) అనుమానస్పదంగా మృతిచెందినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారికి జ్వరం వచ్చిందని ఉదయం ఏడు గంటలకు గురుకుల పాఠశాల నుండి ఫోన్ వచ్చిందని తెలిపారు.
కాగా, ఉదయం తీవ్రమైన జ్వరం రావడంతో హాస్పిటల్ కు తరలించామని, ఆ లోపే చనిపోయిందని డాక్టర్లు చెప్పారని హాస్టల్ సిబ్బంది వెల్లడించారు. కాగా, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమించే వరకు తమకు కనీస సమాచారం కూడా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.