ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వ తేదీ వరకు అనుమతిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారంలో ఆరు రోజుల పాటు ఈ తోటను అందరూ సందర్శించవచ్చు,
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొలువైన అందమైన పూలతోట అమృత్ ఉద్యాన్ ఫ్రిబ్రవరి 2 నుంచి సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అయితే ఈ భవన్ నుంచి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ ఉద్యాన్ ను సందర్శించేందుకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వ తేదీ వరకు అనుమతిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారంలో ఆరు రోజుల పాటు ఈ తోటను అందరూ సందర్శించవచ్చు,
రాష్ట్రపతి భవన్ లో 15 ఎకరాల్లో ఈ సుందరమైన పూదోట ఉంటుంది. ఇందులో కోలియస్ , సెలోషియా , ట్యూబరోస్ అనే రకరకాల కలర్ ఫుల్ పూల మొక్కలు , అరుదైన మొక్కలు ఉద్యాన్ లో కనుల విందు చేస్తుంది. ఈ గార్డెన్ ను సందర్శించే ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి గేట్ నెం.35 వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ షటిల్ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
*ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5వ తేదీ నాడు అమృత్ ఉద్యాన్ మూసి ఉంచుతారు.
* ఫిబ్రవరి 20, 21న రాష్ట్రపతి భవన్ లో సందర్శకుల సమావేశం కారణంగా ఉద్యానవనం మూసి ఉంచుతారు.
* మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా కూడా ఈ గార్డెన్ ను సందర్శించేందుకు అనుమతించరు. ఈ రోజులు మినహా మార్చి 30 వరకు ఈ ఉద్యానవనాన్ని సందర్మించవచ్చు.