. అయితే ట్రంప్ మాత్రం తమ దేశంలో మాత్రమే ఈ చట్టం అమలు చేస్తున్నట్లు తన మీటింగ్ లో తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని అదిష్టించిన డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పినట్లుగానే పుట్టకతో వచ్చే వారసత్వంపై వేటు వేశారు. అయితే అక్రమ వలసదారుల పిల్లలకు అమెరికా వారసత్వం రాదని తెలిపారు. అలా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా మాత్రమే కాదు దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వలస దారుల పిల్లలకు తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వదని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం తమ దేశంలో మాత్రమే ఈ చట్టం అమలు చేస్తున్నట్లు తన మీటింగ్ లో తెలిపారు.
అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్దుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు , స్టూడెంట్ వీసా పై వచ్చిన వారికి జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే. అయితే దీనిలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.