Vinayakan: 'జైల‌ర్' విల‌న్ వీరంగం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో !

మద్యం మత్తులో విమానశ్రయ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిచినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లోర్ పై కూర్చొని పెద్ద సీన్ క్రియేట్ చేశారు. 


Published Jan 21, 2025 05:09:00 PM
postImages/2025-01-21/1737459720_cr20250121tn678f2c46ba385.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  మలయాళ నటుడు వినాయకన్ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఆయన తన ఇంటి బాల్కనీ లో లుంగీ కట్టుకొని నిలబడి పొరుగింటివారిలో గొడవపడ్డాడు. అసలు ఆయన బట్టలు కూడా సరిగ్గా లేనంత మద్యం మత్తులో ఉన్నారు.తుగూతు సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఆయన పొరుగింటితో గొడవపడడం ఇఫ్పుడు వైరల్ అవుతుంది. రీసెంట్ గా మద్యం మత్తులో విమానశ్రయ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిచినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లోర్ పై కూర్చొని పెద్ద సీన్ క్రియేట్ చేశారు. 


అంతే కాదు తన ఇంట్లో భార్యతో గొడవల కార‌ణంగా ఆయ‌న‌పై పోలీసు కేసు నమోదైంది. అయితే, ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుండ‌టంతో ఆయ‌న్ను సినిమా ఇండ‌స్ట్రీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  మద్యం మత్తు అతను ఏం చేస్తున్నాడో కూడా తెలీకుండా చేస్తున్నాడని అంటున్నారు. 


ప్రజెంట్ వినాయకన్ మంచి బిజీ ఆర్టిస్ట్ . మలయాళం , తమిళ సినిమాలతో నటించి మంచి పేరు సంపాదించారు. మలయాళంలో ఆయన లాస్ట్ సినిమా ఉన్ని ముకుందన్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా మార్కో లో కనిపించారు. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసింది. తమిళ్ లో జైలర్ లో నటించారు.
 

Related Articles