TAMAN: ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం థమన్ మ్యూజికల్ నైట్..!

ఈ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును  తల సేమియా వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కి ఉపయోగించబోతున్నారు.


Published Jan 21, 2025 07:15:00 PM
postImages/2025-01-21/1737467204_12006752337200091233720001737461370427.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆఱ్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతుంది. ఇక మేనేజింగ్ ట్రస్టీ ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ఆయన భార్య భువనేశ్వరి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.ఇది ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును  తల సేమియా వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కి ఉపయోగించబోతున్నారు.


ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతతి తెలిసిందే .ఇక ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఈ తలసేమియా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ స్పెషల్ షో లో తమన్ తో పాటు శివమణి డ్రమ్స్ వాయిస్తున్నారు.తమన్ సంగీతం అందించిన రాంచరణ్ తేజ గేమ్ చెంజర్ చిత్రంతో పాటు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు సంగీతం అందించారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sr-ntr chandrababu-naidu

Related Articles