ప్రియాంకా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ దేవాలయంలో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. తనకు దర్శన ఏర్పాట్లు చేసిన ఉపాసన కొణిదెలకు థ్యాంక్స్ చెప్పారు. కాగా మహేశ్ బాబు, రాజమౌళి సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్ కు వచ్చినట్లు టాక్ నడుస్తుంది. అయితే ప్రియాంకా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ దేవాలయంలో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మనమందరం మన హృదయాలలో శాంతి, శ్రేయస్సు, సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతం. ఓం నమః నారాయణ” అని ఆమె పోస్టులో రాసుకొచ్చారు. దర్శనానికి అన్న ఏర్పాట్లు చేసిన ఉపాసనకు థాంక్యూ చెబుతూ పిక్స్ పోస్ట్ చేశారు.
లాస్ ఏంజెలెస్ నుంచి ప్రియాంక చోప్రా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. రాజమౌళి సినిమా లో ప్రియాంక హీరోయిన్ గా చేస్తుందనే టాక్ . అయితే సినిమాలో ఆమే హీరోయిన్ అని ప్రకటిస్తూ మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.