Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్ !

సింగర్ సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు.


Published Jan 21, 2025 06:30:00 PM
postImages/2025-01-21/1737464467_singersidhsriram.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు లో సిధ్ద్ శ్రీరామ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు తెలీదు. చాలా మంచి మెలోడీ వాయిస్ తో తెలుగు , తమిళ్ , మళయాళంలో సూపర్ డూపర్ సాంగ్స్ పాడారు. ఇప్పుడీ స్టార్ సింగర్ మన హైదరాబాద్ కు రానున్నాడు. అంతేకాదు లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా నిర్వహించనున్నారు.


ఈ నెల ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ను మూవ్ 78 లైవ్ సంస్థ ఈ కాన్సర్ట్ ను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో.. సింగర్ సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నాకు అన్ని ఇండస్ట్రీ లో కంటే తెలుగు లోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో లైవ్ కాన్సర్ట్ చేశాను. మీళ్లీ ఇప్పుడు చేస్తున్నా.ఈ కాన్సర్ట్‌లో నా పాటలతో పాటుగా 80, 90వ దశకంలో వచ్చిన మెలోడీ పాటల్ని కూడా పాడతాను. చాలా మందికి నా తెలుగుతో ప్రాబ్లమ్. సరిగ్గా పలకడం లేదని కంప్లెయింట్ చేశారు. ఈసారి ఆ ప్రాబ్లమ్ రాదని తెలిపారు.


ఈ కాన్సర్ట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం, యూత్ కోసం ఏర్పాటు చేస్తున్నాం.నాకు పర్సనల్‌గా సిధ్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. ఈ ఈవెంట్‌, లైవ్ కాన్సర్ట్ అద్భుతంగా ఉండబోతోంది. గ్రూపుగా టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu singer sriram

Related Articles