కడియం శ్రీహరికి షాక్..ఆ విషయంలో నోటీసులిచ్చిన స్పీకర్

పార్టీ ఫిరాయింపు కేసులో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ ఎ న్నికల్లో  బీఆర్ఎస్ తరనపున గెలిచిన కడియం శ్రీహరి , పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిళషన్ వేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలంటూ కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. రేపు ఇద్దరు నేతలు తమ ఆధారాలు తీసుకొని విచారణకు హాజరుకావాలని సూచించారు.


Published Feb 03, 2026 03:36:24 PM
postImages/2026-02-03/1770113184_speaker.jpg

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని గతంలో స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి తీర్పు ప్రకటించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్ లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ ఇటీవల స్పీకర్ తీర్పు ప్రకటించారు.

ప్రస్తుతం స్పీకర్ దగ్గర మరో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పెండింగ్ లో ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు సంబంధించి విచారణ పూర్తి అయినప్పటికీ ఇంకా తీర్పు ప్రకటించలేదు. అటూ దానం నాగేందర్ ను కూడా ఇటీవల విచారించారు. అయితే దానం నాగేందర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన  పిటిషన్ ప్రస్తుతం వాయిదా పడింది. దీనిపై ఈ నెల 18న విచారించనున్నారు. మిగిలిన కడియం శ్రీహరికి ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ జరపనున్నారు.

 పెండింగ్ లో ఉన్న దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కడియం శ్రీహరిలకు సంబంధించిన తీర్పు ఒకేసారి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 6న ఫిరాయింపు కేసులపై సుప్రీం కోర్టు విచారించనుంది. గత వాయిదాలో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 31 వరకు 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గడువు ఇవ్వాలని స్పీకర్ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు ముగిసినా ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ నెల 6న సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

newsline-whatsapp-channel
Tags : kcr ktr telanganam brs- assembly telangana-political-updates political-news political-facts kadiyam-srihari

Related Articles