BRS: రేవంత్ రెడ్డిపై దుమ్మురేపుతున్న బతుకమ్మ పాటలు!

తెలంగాణ ఉద్యమంలో మన గోస చెప్పుకోవడానికి, నిరసన తెలియజేయడానికి కూడా పాడేవారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. 


Published Sep 18, 2025 04:12:00 PM
postImages/2025-09-18/1758192446_f4d4aeeb3f164eb292c1b53efe651196.jpeg

న్యూస్ లైన్, పొలిటికల్ డెస్క్ (సెప్టెంబర్ 18) : తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలకు రెడీ అవుతోంది తెలంగాణ. మామూలుగా బతుకమ్మ అంటే పూల పండుగ, పాటల పండుగ. అందుకే పండగ ముందు బతుకమ్మ పాటలు చాలా వస్తాయి. యూట్యూబ్ ను షేక్ చేస్తాయి. అయితే బతుకమ్మ పాటలను ఒక్క పండగ కోసమే కాదు.. తెలంగాణ ఉద్యమంలో మన గోస చెప్పుకోవడానికి, నిరసన తెలియజేయడానికి కూడా పాడేవారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. 

ఈ బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ కొన్ని బతుకమ్మ పాటలను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేశారంటూ కొన్ని బతుకమ్మ పాటలను రూపొందించారు. ఆ బతుకమ్మ పాటలను గురువారం(సెప్టెంబర్ 18)న తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మహిళా నేతల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఇప్పుడు పాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. మరా సాంగ్ ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu brs party bathukamma

Related Articles